బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మూడో వీకెండ్ ని యావరేజ్ కలెక్షన్స్ తో ముగించిన బంగార్రాజు సినిమా ఇప్పుడు మూడో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది. సోమవారం సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ మరోసారి హేవిగానే ఉన్నాయి అని చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ఆల్ మోస్ట్ 50% వరకు డ్రాప్స్ ను 17 వ రోజు తో పోల్చితే సొంతం చేసుకుంది….
ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొద్ది వరకు గ్రోత్ కనిపించినా కానీ సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ హోల్డ్ కానీ కలెక్షన్స్ కానీ సరిపోవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 18 వ రోజు కి వచ్చే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో…
15 లక్షలకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 18 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. మరి మొత్తం మీద సినిమా 18 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…