నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారలను గ్రాండ్ గా పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టగా మూడో వారం వీకెండ్ లో మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెడుతూ దూసుకు పోతుంది ఈ సినిమా. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 18 వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ దొరకగా ఆ అడ్వాంటేజ్ ను సాలిడ్ గా వాడుకుంటున్న సినిమా…
మార్నింగ్ షోల నుండే రాంపేజ్ ను చూపెట్టడం స్టార్ట్ చేసిందని చెప్పాలి. ఆల్ రెడీ కొన్ని చోట్ల థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతూ ఉండటంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరో సారి సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే అవకాశం…
ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉన్న నేపధ్యంలో 17 వ రోజు తో పోల్చితే మంచి గ్రోత్ ని చూపెట్టి సినిమా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. రోజు ముగిసే సరికి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధించిందో మరో సారి అప్ డేట్ చేస్తాం.