బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా రెండు వారాలను సాలిడ్ గా కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టి మూడో వీకెండ్ లో సినిమా తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది.
సినిమా 17వ రోజున 16వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ గ్రోత్ ని చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉంది…
చాలా సెంటర్స్ లో సినిమా ఆల్ మోస్ట్ 17వ రోజు కి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల బుకింగ్స్ ట్రెండ్ డే 17కన్నా బెటర్ గా ఉంది… ఓవరాల్ గా సినిమా 18వ రోజు కలెక్షన్స్ పరంగా 17వ రోజు కన్నా ఎక్కువ వసూళ్ళని అందుకునే అవాకాశం ఎంతైనా ఉంది…
17వ రోజు 56 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఇప్పుడు 18వ రోజు క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆల్ మోస్ట్ 17 వ రోజుకి ఈక్వల్ గా ట్రెండ్ అవుతూ ఉండటంతో ఈ రోజు సినిమా ఈజీగా 65-70 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ కి ఇప్పుడు ఆల్ మోస్ట్ దగ్గరగా వచ్చింది అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 18 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.