బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజున అనుకున్న దాని కన్నా కూడా చాలా బెటర్ గా హోల్డ్ చేసి మాస్ రాంపెజ్ ను తలపించిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అంచనాలను మించి దుమ్ము లేపిన తర్వాత ఇప్పుడు 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో…
మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ ఉండగా ఆంధ్ర అండ్ సీడెడ్ లో కూడా ఇప్పుడు 18వ రోజు మంచి జోరుని చూపెడుతూ ఉండగా నైట్ షోలకు నైజాంలో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా…
మొత్తం మీద మరోసారి బుకింగ్స్ సాలిడ్ గానే ఉండటంతో 18వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక హిందీలో సినిమా ఈ రోజు రెట్టించిన జోరు చూపిస్తూ ఉండగా…
9-10 కోట్ల రేంజ్ దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.4-1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా వరల్డ్ వైడ్ గా…
18వ రోజున 12 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి షేర్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా 18వ రోజు అంచనాలను మించి జోరు చూపిస్తూ ఉండటం విశేషం. ఇక టోటల్ గా 18 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.