బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ను ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) ఇప్పుడు తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా కి ఇక సంక్రాంతి సినిమాల రిలీజ్ కి తక్కువ రోజులే ఉండటం…
అలాగే బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా 18వ రోజు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా సినిమా సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుందని చెప్పాలి. తెలుగు లో మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే….
సినిమా 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక హిందీలో సినిమా కోటి రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల సినిమా సాలిడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సలార్ మూవీ…
మొత్తం మీద 18వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.