Home న్యూస్ ఇండియాలో మొదటి 150 కోట్ల సినిమా శివాజీకి 18 ఏళ్ళు….బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

ఇండియాలో మొదటి 150 కోట్ల సినిమా శివాజీకి 18 ఏళ్ళు….బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ పాన్ ఇండియా మూవీస్ హవాలో వరుస పెట్టి సినిమాలు పెరిగిన మార్కెట్ అడ్వాంటేజ్ లతో అవలీలగా 100 కోట్ల మార్క్ ని అందుకుంటూ మాస్ రచ్చ చేస్తున్నాయి కానీ ఒకప్పుడు ఉన్న టికెట్ రేట్స్ తో ఈ మార్క్ ని అందుకోవడం చాలా కష్టంగా ఉన్న టైంలో ఇండియా లో మొదటి సారిగా…

ఏకంగా 150 కోట్ల కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించాడు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు శంకర్ లు…వీళ్ళ కాంబోలో విపరీతమైన హైప్ తో రూపొందిన శివాజీ ది బాస్(Sivaji The Boss Movie) సెన్సేషనల్ రికార్డులను ఎన్నో క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది..

తెలుగు లోనే చూసుకుంటే అప్పట్లోనే ఆల్ మోస్ట్ 12 కోట్లకు పైగా బిజినెస్ చేసి సంచలనం సృష్టించగా టోటల్ రన్ లో 18 కోట్లకు పైగా షేర్ ని 27.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

తమిళనాడులో అప్పట్లో 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…ఓవర్సీస్ మార్కెట్ లోనే ఆల్ మోస్ట్ 8.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని అప్పట్లో అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 151 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 76 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…

తెలుగు రాష్ట్రాలలో 50 రోజులను 39 డైరెక్ట్ సెంటర్స్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ లో కూడా డీసెంట్ వసూళ్ళని సాధించి సత్తా చాటుకుంది అప్పట్లో… ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ 60 కోట్ల రేంజ్ లో ఉంటే సినిమా ఆ టార్గెట్ ను చూసి అసలు…

ఈ సినిమా అంత కలెక్ట్ చేస్తుందా అని అందరూ అనుకున్నారు, కానీ అంచనాలను మించి పోయే రేంజ్ లో వసూళ్ళ జాతర సృష్టించిన ఈ సినిమా టార్గెట్ మీద 16 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సైతం సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. అలాంటి శివాజీ ది బాస్ వచ్చి 18 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం విశేషం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here