బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ మూడో వీకెండ్ వరకు కుమ్మేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూడో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా 18 రోజుల పాటు నాన్ స్టాప్ జాతర సృష్టించిన దేవర మూవీ ఇప్పుడు…
19వ రోజు మరో సారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఈ సారి మాత్రం కంప్లీట్ గా అన్ని చోట్లా ఫుల్ వర్కింగ్ డే నే అవ్వడంతో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది… ఓవరాల్ గా 18వ రోజుతో పోల్చితే 30-35% రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ లో కొన్ని చోట్ల డ్రాప్స్ ను కొన్ని చోట్ల డీసెంట్ హోల్డ్ ని చూపించడంతో మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 80-85 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ…
దూసుకు పోతూ ఉన్న దేవర మూవీ మొత్తం మీద లాభాలను మరింతగా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. మరి సినిమా ఓవరాల్ గా మరోసారి 18వ రోజు రేంజ్ లో గ్రోత్ ని చూపించి అంచనాలను మించుతుందో లేక ఇదే రేంజ్ లో షేర్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.