మూడో వీకెండ్ ని మొత్తం మీద మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie)… మూడో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 18వ రోజు వర్కింగ్ డే వలన సాలిడ్ గానే డ్రాప్ అవ్వగా 19వ రోజు ఇప్పుడు…
మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు తో పోల్చితే సినిమా హిందీలోనే పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 19వ రోజు 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 70 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మిగిలిన చోట్ల సినిమా రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
19వ రోజు వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 70 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా ఓవరాల్ గా 19 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.