రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా, మూడో వీకెండ్ లో కూడా మాస్ రచ్చ చేస్తూ ఉండగా 18వ రోజు వరకు వర్కింగ్ డేస్ లో మంచి జోరు ని చూపించిన సినిమా…
19వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించింది. మరీ అనుకున్న రేంజ్ ని మించకపోయినా కూడా ఓవరాల్ గా 1.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 19వ రోజున వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సిరీస్ 2 సినిమాలు 19వ రోజున హైయెస్ట్ షేర్స్ ని సొంతం చేసుకోగా ఆ సినిమాల తర్వాత ప్లేస్ లో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది.
ఒకసారి 19వ రోజున ఆల్ టైం హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమాలను గమనిస్తే…
AP-TG 19th Day Highest Share Movies
👉#Baahubali2 – 2.18CR~
👉#Baahubali – 1.80CR~
👉#SankranthikiVasthunam – 1.59CR*******
👉#AttarintikiDaredi – 1.38Cr
👉#Pushpa2TheRule – 1.35Cr
👉#GeethaGovindam – 1.32Cr~
👉#Devara – 1.02CR
👉#HanuMan – 1.00CR
👉#Karthikeya2 – 96L
👉#Mahanati – 95L~
👉#Rangasthalam – 86L
ఓవరాల్ గా 19 వ రోజున కోటి షేర్ మార్క్ ని దాటడం అన్నదే గొప్ప విషయం అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ రేంజ్ లో రచ్చ చేయడం మరింత విశేషం అని చెప్పాలి. ఇక బాహుబలి సిరీస్ టాప్ 2 రికార్డులు ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.