10 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర రీ ఎంట్రీ ఇచ్చి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రిమార్కబుల్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డితో మరోసారి దుమ్ము లేపే కలెక్షన్స్ ని అందుకున్నా ఓవరాల్ గా ఎక్కువ బిజినెస్ వలన…
టార్గెట్ ను అందుకోలేక పోయింది…ఆ తర్వాత చేసిన ఆచార్య ఎపిక్ డిసాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ కూడా ఫ్లాఫ్ అవ్వగా ఈ ఇయర్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ…
భోలాశంకర్(Bholaa Shankar) సినిమా తో ఎపిక్ డిసాస్టర్ ను తన ఖాతాలో వేసుకోవడం అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది. వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూగా 12 రోజుల పాటు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా ఇప్పుడు…
భోలా శంకర్ మూవీ మాత్రం కేవలం 3 రోజులు మాత్రమే కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది. ఒకసారి రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమాల లిస్టు ని ఒకసారి గమనిస్తే….
#MegastarChiranjeevi Recent Movies Continuous 1cr Shares in AP TG
👉#BholaaShankar – 3 Days*****
👉#WaltairVeerayya – 12 Days
👉#GodFather – 6 Days
👉#Acharya – 3 Days
👉#SyeRaa – 13 Days
👉#Khaidino150 – 14 Days
ఖైదీనంబర్ 150 సినిమా 14 రోజుల పాటు అల్టిమేట్ రన్ ని కొనసాగించి చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా సైరా సినిమా కూడా 13 రోజుల్లో దుమ్ము లేపింది. ఈ ఇయర్ భోలా శంకర్ తీవ్రంగా నిరాశ పరిచినా కూడా వాల్తేరు వీరయ్య 12 రోజులతో ఈ ఇయర్ ఇంకా టాప్ ప్లేస్ లోనే ఉంది… కానీ శిఖరం నుండి ఇప్పుడు భోలా శంకర్ తో నేలపైకి వచ్చినట్లు అయింది.