Home న్యూస్ $10,00,000 ఔట్ అక్కడ…15 రోజుల ముందే రికార్డుల భీభత్సం!

$10,00,000 ఔట్ అక్కడ…15 రోజుల ముందే రికార్డుల భీభత్సం!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా మంచి బజ్ నడుమ రిలీజ్ అవ్వగా వాటిలో కొన్ని సినిమాలు అంచనాలను అందుకోక పోయినా కూడా ప్రభాస్ రేంజ్ ని ఏమాత్రం తగ్గించలేదు… రాదే శ్యామ్ లాంటి డిసాస్టర్ తర్వాత సైతం ప్రభాస్ సినిమాల బజ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉండగా ఇప్పుడు…

సలార్(Salaar Movie) లాంటి ఊరమాస్ మూవీ తర్వాత ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ అయిన కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా మీద హైప్ ఓ రేంజ్ లో ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ మరింతగా పెరిగిపోయింది అని చెప్పాలి ఇప్పుడు. ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా సాగుతూ ఉండగా…

నార్త్ అమెరికాలో సినిమా బుకింగ్స్ రాక్ సాలిడ్ గా సాగిపోతూ ఉండగా సినిమా రిలీజ్ కి ఇంకా 15 రోజుల టైం ఉండగానే సినిమా కి జరిగిన అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా ఏకంగా 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. వీకెండ్ ప్రీ టికెట్ సేల్స్ లెక్క ఇంకా ఎక్కువగా ఉండగా ఓవరాల్ గా సినిమా కి ఓపెన్ చేసిన లోకేషన్స్ లో…

అడ్వాన్స్ టికెట్ సేల్స్ లెక్క ఓ రేంజ్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఊపు చూస్తూ ఉంటే రిలీజ్ టైంకి రికార్డ్ లెవల్ లో ప్రీ సేల్స్ తో దుమ్ము లేపే రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఇండియన్ కరెన్సీలో ఆల్ రెడీ 8.5 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా రిలీజ్ కి 15 రోజుల టైం ఉండగానే సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా రిలీజ్ రోజున అన్నీ అనుకున్నట్లు జరిగితే రికార్డుల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక రిలీజ్ టైంకి సినిమా ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here