బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా పై ఆడియన్స్ లో ఎక్స్ లెంట్ క్రేజ్ ఉండగా ఆ క్రేజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన భీమ్లా నాయక్ ఆంధ్ర లో పరిస్థితులు ఎదురు దెబ్బ తీసినా కానీ ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ….
దూసుకు పోతూ ఉండగా సినిమా ఓవరాల్ బిజినెస్ టార్గెట్ అయిన 108 కోట్ల మార్క్ ని అందుకోవడానికి ఇంకా టైం ఉండగా అన్ని ఏరియాలలోకి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాగా ఏ ఏరియా నిలుస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఈ మాస్ మూవీ కి….
ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి అని చెప్పాలి. సినిమా ఇప్పుడు మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో అమెరికాలో అఫీషియల్ గా 2 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు మూడు రోజులు పూర్తీ అయ్యే టైం కి…
21 కోట్లకు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకుని 10 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది… దాంతో ఓవర్సీస్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సంచలనం సృష్టించింది. టోటల్ ఓవర్సీస్ బిజినెస్ 9 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తోనే ఆల్ మోస్ట్ బిజినెస్ ను అందుకోగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను కూడా సొంతం చేసుకుని మొత్తం మీద ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న ఏరియాగా నిలిచింది, ఈ మాస్ మూవీ క్లాస్ మూవీస్ ఇష్టపడే ఓవర్సీస్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకుని ఇలా రెచ్చిపోవడం విశేషం అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో అక్కడ ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.