మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఇప్పుడు మొదటి వారాన్ని అత్యంత ఘనంగా పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది… సినిమా ఓవరాల్ గా అత్యంత భారీ బిజినెస్ ను అందుకోగా రిలీజ్ కి ముందు బిజినెస్ ను కొంచం తగ్గించారు మేకర్స్… అయినా కానీ తగ్గించిన బిజినెస్ టాలీవుడ్ చరిత్ర లోనే…
ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు ఇండియన్ మూవీస్ లో కూడా బిగ్గెస్ట్ బిజినెస్ ను అందుకోగా ఈ మమ్మోత్ బిజినెస్ లో ఫస్ట్ ఏ ఏరియా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ గా నిలుస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈ మమ్మోత్ బిజినెస్ లో…
ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాగా నైజాం ఏరియా నిలిచింది. సినిమా కి నైజాం ఏరియా లో ఏకంగా 70 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం అయింది. కాగా సినిమా 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి 73.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఇక్కడ బిజినెస్ ను దాటేసి…
బ్రేక్ ఈవెన్ గా నిలవగా 7 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 75 కోట్ల మార్క్ ని కూడా దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ నైజాం ఏరియాలో ఫస్ట్ 75 కోట్ల మూవీగా దూసుకు పోతుంది, కాగా ఓవరాల్ బిజినెస్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా గా నిలిచిన నైజాం ఏరియా లో ఇప్పుడు…
సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో అవలీలగా 100 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సెకెండ్ వీకెండ్ లో జోరు చూపితే ఈ మార్క్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పొచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెల్లగలుగుతుందో చూడాలి…