Home న్యూస్ 2.0 డే 1 ఓపెనింగ్స్…రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్

2.0 డే 1 ఓపెనింగ్స్…రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్

0

 

  సెన్సేషనల్ ఎపిక్ వండర్ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు అనేక అంచనాల నడుమ నేడు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేయగా ప్రేక్షకుల నుండి సినిమా కి వస్తున్న రెస్పాన్స్ కూడా భీభత్సంగా ఉందని చెప్పొచ్చు. ప్రీమియర్ షోలు, స్పెషల్ షోల నుండి అద్బుతమైన పాజిటివ్ టాక్ వస్తుండటం తో మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు అందరి లోను ఆసక్తి ని రేపుతుంది. కాగా సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

తెలుగు: రోబో 2 తెలుగు వర్షన్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఓపెన్ అయ్యి సంచలనం సృష్టించింది. అన్ని చోట్లా ఆల్ మోస్ట్ 90% ఆక్యుపెన్సీ తో దుమ్ము దుమారం చేస్తుండటం తో మొదటి రోజు లెక్క అవలీలగా 16 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.

తమిళ్: తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కొంచం స్లో గా స్టార్ట్ అయినా అల్టిమేట్ రివ్యూ లతో పుంజుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ జోరు పెంచింది. తొలిరోజు లెక్క ఎలా ఉంటుందో తెలియదు కానీ 30 కోట్ల రేంజ్ పక్కా అని అంటున్నారు.

హిందీ: మిగిలిన భాషలతో పోల్చితే హిందీ బుకింగ్స్ వీక్ గా ఉన్నా ఇప్పుడు మౌత్ టాక్ తో సినిమా మ్యాట్నీ షోల నుండి పుంజుకుంది. ఈ లెక్క ఈవినింగ్ నైట్ షోలకి ఇలాగే ఉంటె 30 కోట్ల నెట్ వసూళ్లు పక్కా అని చెప్పొచ్చు.

ఇక మిగిలిన చోట్లా కూడా సినిమా దుమ్ము దుమారం చేస్తూ ఓపెన్ అవ్వగా తొలిరోజు లెక్క టోటల్ గా 150 కోట్ల రేంజ్ గ్రాస్ మాత్రం పక్కా అని తేలుతుంది. నైట్ షోల గ్రోత్ బాగుంటే ఈ లెక్క మరో రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here