Home న్యూస్ ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!

ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!

6155
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండాల్సింది కానీ అనేక కారణాల వలన ఎప్పటికప్పుడు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా ఇక డైరెక్ట్ రిలీజ్ అవుతుంది అనుకున్న టైం లో థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎప్పుడో 1990’s…..

కాలం నాటి కథతోనే తెరకెక్కిన కమర్షియల్ హంగులు అయితే ఉండటం తో మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి అయితే రప్పించగలిగింది కానీ అది గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ రేంజ్ లో అయితే కాదనే చెప్పాలి. అయినా కానీ ఉన్నంతలో సినిమా తెలుగు రాష్ట్రాలలో…

మార్నింగ్ అండ్ నూన్ షోలకు 15% రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి ఇంకో 10% వరకు ఇంప్రూవ్ మెంట్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంది. సినిమా ఈ లెక్కన ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు…

30 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకునే ఛాన్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల అనుకూలంగా ఉంటే సినిమా 50 లక్షల దాకా కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పాలి. మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 2.95 కోట్లకి ఫైనల్ అయ్యింది అని ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ కోసం..

ఇప్పుడు 3.2 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర సీటిమార్ సినిమా ఫస్ట్ డే 2.98 కోట్ల షేర్ ని అందుకుంది. ఆ సినిమా వచ్చిన నెల లోపే ఈ సినిమా వచ్చినా 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయినా ఓపెనింగ్స్ అంతంత మాత్రమే వచ్చేలా ఉన్నాయని చెప్పాలి. మరి మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here