Home న్యూస్ ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….సాలిడ్ దెబ్బ ఇది!!

ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….సాలిడ్ దెబ్బ ఇది!!

749
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకుని థియేటర్స్ నుండి వెళ్ళిపోగా గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ సినిమా ఆడియన్స్ ముందుకు ఎట్టకేలకు అనేక అవరోధాలను దాటుకుని రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఓల్డ్ మూవీ కాబట్టి స్టొరీ కూడా చాలా రొటీన్ గానే ఉండటంతో సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో చాలా స్లోగా ఓపెన్ అవ్వగా కొన్ని మాస్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డా కానీ మొత్తం మీద ఆక్యుపెన్సీ యావరేజ్ గానే ఉంది… ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొన్ని చోట్ల సినిమా పర్వాలేదు అనిపించగా…

40-50 లక్షల రేంజ్ షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా కి హైదరాబాదులో నైట్ షోలకు హెవీ వర్షాల వలన ఇబ్బంది గట్టిగానే పడింది. దాంతో కలెక్షన్స్ మొత్తం మీద మొదటి రోజు 30 లక్షల రేంజ్ లోనే సరిపెట్టుకుంది సినిమా…. మొత్తం మీద సినిమా…

మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 10L
👉Ceeded: 6L
👉UA: 3L
👉East: 3L
👉West: 2L
👉Guntur: 2L
👉Krishna: 2L
👉Nellore: 1.8L
AP-TG Total:- 0.30CR(0.50CR~ Gross)
Rest – 3L~
Total WW – 0.33Cr(0.56CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్క.

సినిమా ఓవరాల్ బిజినెస్ రేంజ్ 2.95 కోట్ల వరకు ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన సినిమా 3.2 కోట్ల షేర్ ని అందుకోవాలి. ఫస్ట్ డే తర్వాత సినిమా ఇంకా 2.87 కోట్ల రేంజ్ షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here