Home న్యూస్ చాణక్య ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్ కలెక్షన్స్!!

చాణక్య ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్ కలెక్షన్స్!!

2539
0

     యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ చాణక్య, రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ రివ్యూ లను అన్ని చోట్లా సొంతం చేసుకుంది, కాగా గోపీచంద్ పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది, అలాగే విజువల్స్ కి ప్రొడక్షన్ వాల్యూస్ కి కూడా రెస్పాన్స్ బాగుంది కానీ సినిమా లో మరీ అంత సత్తా లేక పోవడం తో యావరేజ్ రివ్యూ లను సొంతం చేసుకుంది ఈ సినిమా.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా కలెక్షన్స్ కోసం చాలా కష్టాలే పడింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ సినిమా సైరా పోటి లో ఉండటం తో చాణక్య సినిమా ఆ పోటి ని తట్టుకుని నిలబడ లేక పోయింది, దాంతో ఓపెనింగ్స్ చాలా చోట్లా…

చాలా తక్కువ కలెక్షన్స్ ని నమోదు చేసింది ఈ సినిమా, రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మీద సినిమా మొదటి రోజు ఆక్యుపెన్సీ టోటల్ గా 30% కన్నా తక్కువే నమోదు అయినట్లు సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న విధంగా ఉంటె తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 1 కోటి నుండి 1.2 కోట్ల మేర షేర్ ని నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 1.4 కోట్ల దాకా షేర్ ని సాధించే అవకాశం ఉందని అంటున్నారు.

కానీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్లకు పైగా ఉండటం బ్రేక్ ఈవెన్ కి సినిమా 12 కోట్ల దాకా షేర్ ని రాబట్టాల్సిన అవసరం ఉండటం తో ఎంతవరకు సినిమా ఈ టార్గెట్ ని దసరా సెలవుల అడ్వాంటేజ్ తో అందుకుంటుంది అన్నది ఆసక్తి కారణం, ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here