ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ నుండి డైరెక్టర్ గా మారిన ఎం ఎస్ రాజు గారి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ డర్టీ హరి… టీసర్ పోస్టర్స్ తో యూత్ లో మంచి బజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను కొత్త యాప్ లో సొంతం చేసుకోగా ఫస్ట్ డే సినిమా ను చూడటానికి అందరూ ఎగబడటం తో సర్వర్లు క్రాష్ అయ్యి ఆడియన్స్ చాలానే ఇబ్బంది పడ్డారు. తర్వాత పరిస్థితి అర్ధరాత్రి టైం కి సెట్ అవ్వగా…
అప్పటి నుండి రోజు మొత్తం ముగిసే టైం కి ఈ సినిమా సాధించిన వ్యూస్ ని అఫీషియల్ గా రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ చేసి అప్ డేట్ చేశారు. మొదటి రోజు సినిమా కి సెన్సేషనల్ అనిపించే వ్యూస్ దక్కగా టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ సినిమాను గట్టిగానే చూశారు అనిపిస్తుంది.
వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ లో మొదటి రోజు సినిమా కి 91818 వేల యూనిక్ వ్యూస్ దక్కినట్లు అనౌన్స్ చేశారు, అంటే జనాలు టికెట్ 120 రేటు పెట్టి సినిమా ను చూశారు.. దాంతో మొదటి రోజు సాలిడ్ గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు… సినిమా కి మొదటి రోజు మొత్తం మీద…
ఈ వ్యూస్ తో 120 టికెట్ రేటు తో ఆల్ మోస్ట్ 1.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఉంటాయి, ఇవి నిజంగానే సెన్సేషనల్ కలెక్షన్స్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ మాత్రం చిల్లరగా వస్తున్న నేపధ్యంలో ఈ పే పెర్ వ్యూ పద్దతి లో సినిమాకి దక్కిన వ్యూస్ ప్రకారం సాలిడ్ స్టార్ట్ ని…
సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు… ఇక వీకెండ్ కి గాను సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో అన్నది తెలియాల్సి ఉండగా సినిమా బడ్జెట్ వివరాలు కూడా ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది, లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమాను తెరకెక్కించారు అని అంటున్నారు కాబట్టి వీకెండ్ లోనే సినిమా బడ్జెట్ రికవరీ అయినా కావొచ్చని అంతా భావిస్తున్నారు.