Home న్యూస్ డాక్టర్ 1st డే కలెక్షన్స్…అక్కడ రికార్డులు పక్కా!

డాక్టర్ 1st డే కలెక్షన్స్…అక్కడ రికార్డులు పక్కా!

1486
0

కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ తెలుగు లో వరుణ్ డాక్టర్ పేరుతో డబ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ నుండి సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి జోరు ని చూపెడుతూ దూసుకు పోతుంది. తెలుగు లో సినిమా చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా…

మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా వైజాగ్, ఈస్ట్, కృష్ణా లాంటి ఏరియాల్లో సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి, నైజామ్ సీడెడ్ ఏరియాల్లో ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించగా మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా షో షో కి బాగానే ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాయి…

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మొదటి రోజు 15-20 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది, ఇక సినిమా తమిళనాడు లో మాత్రం…

ఈ ఇయర్ మాస్టర్ తర్వాత బెస్ట్ అనిపించుకునే ఓపెనింగ్స్ ను అందుకుందని అక్కడ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత కోలివుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ ఈ సినిమా అవ్వడం కన్ఫాం అని, బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు ఇప్పుడు తమిళ్ వర్షన్ సుమారు 10 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అందుకునే…

అవకాశం ఈ సినిమా కి ఎంతైనా ఉందని అంటున్నారు. ఇది నిజంగానే ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఫస్ట్ డే తెలుగు లో స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా వీకెండ్ లో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది. మరి సినిమా మొత్తం మీద అఫీషియల్ గా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here