బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమానే అయినా కానీ ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేసిన సినిమాగా హ్యాపీ బర్త్ డే సినిమా నిలుస్తుంది అని చెప్పాలి. జనాలను తిరిగి థియేటర్స్ కి రప్పించే సినిమా ఇదే అవుతుంది అని అందరూ అనుకున్నారు, టికెట్ రేట్స్ ని కూడా భారీగా తగ్గించేశారు. కానీ ఇవేవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి…
అడ్వాంటేజ్ కాలేక పోయాయి, జనాలు థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో అస్సలు రాలేదు, సినిమాను మొత్తం మీద 200 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయగా రోజు మొత్తం మీద ఓవరాల్ ఆక్యుపెన్సీ 10% కి అటూ ఇటూగానే ఉంది ఓవరాల్ గా…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా… ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 40 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సాధించిందని సమాచారం. ఇక సినిమా బిజినెస్ లెక్కలు ఏవి కూడా క్లియర్ గా రివీల్ అవ్వలేదు. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.