Home న్యూస్ ఇష్క్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…ఇదెక్కడి దెబ్బరా బాబు!

ఇష్క్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…ఇదెక్కడి దెబ్బరా బాబు!

2709
0

తేజ సజ్జ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టొరీ సినిమా మలయాళంలో సూపర్ హిట్ మూవీ కి రీమేక్ గా తెరకేక్కడంతో తెలుగులో మంచి టాక్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుందని అంతా అనుకున్నారు, సినిమా కి ఆడియన్స్ లో మంచి పబ్లిసిటీ లాంటివి చేసినా కానీ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఇప్పుడు అంచనాలను అందుకోలేదు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 330 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు లో ఓపెనింగ్స్ పరంగా తిమ్మరుసు కన్నా బెటర్ గా మార్నింగ్ అండ్ నూన్ షోలకు ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది, కానీ తర్వాత టాక్ ఎఫెక్ట్ చూపడం వలన…

తిమ్మరుసు బాక్స్ ఆఫీస్ దగ్గర పుంజుకోగా ఇష్క్ సినిమా మాత్రం స్లో డౌన్ అయింది, సినిమా మొదటి రోజు మొత్తం మీద 20 నుండి 25 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధిస్తుంది అనుకున్నా కానీ మొత్తం మీద 15 లక్షల రేంజ్ కలెక్షన్స్ తోనే సినిమా మొదటి రోజు సరిపెట్టుకుంది.

దాంతో ఫస్ట్ డే నే సినిమా మినిమం అంచనాలను కూడా అందుకోలేక పోయింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ 20 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా సాలిడ్ దెబ్బ తో మొదటి రోజు కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 2.7 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే రెండో రోజు నుండి సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది, మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని రెండో రోజు సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here