తమిళ్ స్టార్ హీరోలలో ఒకరైన కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ, బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ తెలుగు భాషల్లో ఏక కాలం లో దీపావళి వీకెండ్ లో బిగిల్ లాంటి కమర్షియల్ మూవీ కి పోటి గా రిలీజ్ అయిన ఈ సినిమా పై పెద్దగా బజ్ ఏర్పడలేదు, కానీ రిలీజ్ అయిన మొదటి ఆటకే యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా కొంచం షాక్ ఇచ్చింది.
యునానిమస్ టాక్ రావడం ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ ఉండటం తో తొలిరోజు అవలీలగా సినిమా కోటి కి పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని అనుకున్నా అలా జరగలేదు, సినిమా 90.4 లక్షల దాకా గ్రాస్ ని 62 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో…
మొదటి రోజు మొత్తం మీద అందుకుంది, అది కొంచం షాకింగ్ లో కలెక్షన్స్ అనే చెప్పాలి, కానీ మొదటి రెండు షోలకు చాలా లో ఓపెనింగ్స్ రావడం ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పెద్దగా లేకపోవడం ఎఫెక్ట్ చూపింది అని అంటున్నారు కానీ మొదటి రోజు బజ్ లేకపోవడం ఎఫెక్ట్ చూపింది.
కానీ సినిమా కి యునానిమస్ హిట్ టాక్ ఉండటం తో కచ్చితంగా రెండో రోజు నుండి జోరు చూపే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రోజు మార్నింగ్ షోల నుండే ఆ గ్రోత్ కనిపిస్తుంది. ఇక సినిమా టోటల్ బిజినెస్ 4.3 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి సినిమా 5 కోట్ల వరకు షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకోవాల్సి ఉంటుంది.
కాగా మొదటి రోజు 62 లక్షల షేర్ కాకుండా సినిమా మరో 4.38 కోట్ల షేర్ ని అందుకుంటే తెలుగు లో బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఈ రోజు నుండి సోమవారం వరకు ఆల్ మోస్ట్ హాలిడేస్ లాంటివే కాబట్టి సినిమా జోరు చూపితే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.