మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ కురుప్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగు లో సినిమా చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, థియేటర్స్ చాలా తక్కువ దొరికినా కానీ షేర్స్ ఎక్కువ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ థియేటర్స్ లో రెంట్స్ ఎక్కువ పే చేయాలి సో షేర్స్ తగ్గుతాయి, తక్కువ థియేటర్స్ లో షేర్స్ ఎక్కువ మిగులుతాయి…
అది సినిమా కి కలిసి వచ్చి తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో అంచనాలను మించిపోయి బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసింది ఈ సినిమా, సినిమా ఫస్ట్ డే తెలుగు లో 20 లక్షలకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా ఆఫ్ లైన్ టికట్ సేల్స్…
బాగుంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నాం కానీ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఏకంగా 38 లక్షల షేర్ ని 71 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుని ఊహకందని ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ రేంజ్ లో గ్రోత్ చూపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఇక సినిమా కేరళ కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద తెలుగు తో కలిపి 2.1 కోట్ల దాకా గ్రాస్ ను వసూల్ చేసిందట. ఇక కేరళలో ఆల్ మోస్ట్ 5 కోట్ల దాకా ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. దాంతో టోటల్ గా ఇండియాలో సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు.
ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు మొదటి రోజు కి గాను 10-11 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చని అంటూ ఉండటం విశేషం, ఓవరాల్ గా అన్ని చోట్లా కూడా సినిమా కంప్లీట్ గా అంచనాలను అన్నీ మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. తెలుగులో 80 లక్షల టార్గెట్ కి సినిమా ఇంకా 42 లక్షల దూరంలో ఉంది… వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఎంతైనా ఉంది.