Home న్యూస్ మహా సముద్రం 1st డే కలెక్షన్స్…మాస్ కుమ్ముడు ఇది!!

మహా సముద్రం 1st డే కలెక్షన్స్…మాస్ కుమ్ముడు ఇది!!

2648
0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ మరియు సిద్దార్థ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ మహా సముద్రం సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా 780 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. తొలిరోజు సినిమా కి ఆడియన్స్ నుండి డే ఎండ్ టైం కి ఇప్పుడు మిక్సుడ్ రివ్యూలు వస్తున్నాయి…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సినిమా ఇప్పుడు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 100% ఆక్యుపెన్సీ వలన ఆంధ్రలో ఆక్యుపెన్సీ బాగున్నా ఫుల్స్ అనుకున్న రేంజ్ లో పడలేదు, నైజాంలో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు బతుకమ్మ పండగ వలన కొద్దివరకు ఎఫెక్ట్ పడింది.

అయినా ఇవన్నీ తట్టుకుని కూడా సినిమా మాస్ కుమ్ముడు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని ఇప్పుడు మొదటి రోజు సాధించేలా ఉందని చెప్పాలి. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా రోజు మొత్తం ఆన్ లైన్ టికెట్ సేల్స్ బుకింగ్స్ చూసుకుంటే 35-40% రేంజ్ బుకింగ్స్ జరిగాయి.

ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా అన్ని చోట్ల బాగుంటే ముందు అనుకున్నట్లుగానే సినిమా 3 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి, కంప్లీట్ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి 3.5 కోట్ల మార్క్ ని అందుకునే మించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 4 కోట్లకి అటూ ఇటూగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పాలి.

ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తే 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి అద్బుతంగా సినిమా పెర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. మరి కంప్లీట్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎలా ఉంటాయి అన్న దానిపై సినిమా అంచనాలను మించుతుందా లేదా అన్నది చెప్పగలం. సినిమా అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు వచ్చాక అప్ డేట్ చేస్తాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here