కింగ్ నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ ల కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మన్మథుడు 2, మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓవరాల్ గా ప్రీమియర్ షోలు మరియు రెగ్యులర్ షోలకు టాక్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో ఉంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే నాగార్జున రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ ఎఫెక్ట్ ఈ సినిమా పై కూడా పడింది.
ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓవరాల్ గా 35% కి పైగా ఉండగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయానికి 40% కి పైగా ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో మాత్రం పెద్దగా గ్రోత్ లేదనే చెప్పాలి. దాంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడటం ఖాయంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీ తో సినిమా తొలిరోజు 2.4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే చాన్స్ ఉంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల మల్టీ ప్లెక్సులలో బుకింగ్స్ బాగుండటం తో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది, కానీ మాస్ సెంటర్స్ లో ఎలాంటి గ్రోత్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తి కరం.
అన్ని చోట్లా బుకింగ్స్ బాగుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగుంటే ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా 2.5 కోట్ల నుండి 3 కోట్ల మధ్యలో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. కానీ సినిమా బిజినెస్ 18.5 కోట్లు అవ్వడం…
బ్రేక్ ఈవెన్ కి 19.5 కోట్లు అవసరం అవ్వడం తో సినిమా మరింత ఎక్కువగా జోరు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అలా జరిగితేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి రోజు ముగిసే సరికి సినిమా ఎంతవరకు జోరు చూపుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.