కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పెద్దన్న బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమాల కన్నా కూడా డబుల్ రేంజ్ లో థియేటర్స్ కౌంట్ ని సొంతం చేసుకుంది, కానీ ప్రీవియస్ రజినీ మూవీస్ తో కంపేర్ చేసి చూస్తె మట్టుకు ఓపెనింగ్స్ విషయం లో ఈ సారి కొంచం నిరాశ కలిగించేలానే ఫస్ట్ డే ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అని చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీవియస్ రజినీ మూవీస్ సంక్రాంతి పోటిలో కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేశాయి. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పెద్దన్న మాస్ సెంటర్స్ లో కొన్ని చోట్ల ఫుల్స్ పడగా చాలా చోట్ల పర్వాలేదు అనిపించే ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది.
ఈవినింగ్ అండ్ నైట్ షోలకు దీపావళి పూజా కార్యక్రమాల వలన కొంచం ఇబ్బంది కలిగినా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 1.6-1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునేలా ఉందని చెప్పాలి. అన్ని చోట్ల కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.8 నుండి 2 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది,
అయినా కానీ బ్రేక్ ఈవెన్ కి ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. కానీ తమిళనాడులో సెకెండ్ వేవ్ తర్వాత ది బెస్ట్ అనిపించే రేంజ్ లో ఓపెన్ అయిన ఈ సినిమా 15-16 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు..ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 18 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉండగా…
ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో ఆల్ రెడీ 11 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని దూసుకు పోతున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మినిమం 30 కోట్లకి తగ్గని కలెక్షన్స్ తో ఓపెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే 40 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, మరి అఫీషియల్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.