మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ దేవకట్టా ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా ట్రేడ్ కి గట్టి షాకే ఇచ్చింది అని చెప్పాలి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు నాలుగు రోజుల ముందు నుండే స్టార్ట్ అయినా కానీ ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొత్తం మీద మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు మొత్తం మీద నైజాంలో 15-20% రేంజ్ ఆక్యుపెన్సీని, సీడెడ్ లో 12-15% ఆక్యుపెన్సీని ఆంధ్రలో 20-25% ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే… తెలుగు రాష్ట్రాలలో యావరేజ్ గా ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్…
20% రేంజ్ లో ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొన్ని చోట్ల బాగున్నా ఎక్కువ చోట్ల యావరేజ్ గా ఉన్నాయి. ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ అండ్ లో టికెట్ రేట్ల వలన కొన్ని చోట్ల ఫుల్స్ పడ్డా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేలా కనిపించడం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే…
సాయి ధరం తేజ్ రీసెంట్ హిట్ మూవీస్ కాకుండా వచ్చిన తేజ్ ఐ లవ్ యు, ఇంటెలిజెంట్ లాంటి సినిమాల రేంజ్ లో ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది. ప్రజెంట్ ట్రెండ్ ని గమనిస్తే సినిమా ఫస్ట్ డే 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునేలా కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా అనుకూలంగా ఉంటే…
సినిమా 2 కోట్ల రేంజ్ ని అందుకునే అవకాశం ఉంది, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా ఓపెనింగ్స్ బిలో పార్ అనిపించే రేంజ్ లోనే ఉన్నాయి. మరి సినిమా మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక… ఆఫ్ లైన్ తిఎక్ట్ సేల్స్ బాగుంటే అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి.