Home న్యూస్ రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్…బాలయ్య కుమ్మేశాడు!!

రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్…బాలయ్య కుమ్మేశాడు!!

3675
0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ పోటి నడుమ మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలతో రన్ అవుతుంది.

సినిమా సెకెండ్ షోల బుకింగ్స్ కూడా అల్టిమేట్ లెవల్ లో ఉండటం తో మొత్తం మీద మొదటి రోజు ను ఇప్పుడు దుమ్ము లేపే కలెక్షన్స్ తో ముగించబోతుంది ఈ సినిమా. సినిమా తొలి రెండు షోలకు ఓవరాల్ గా 55% కి పైగా ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకోగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి 70% టు 75% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవుతూ దుమ్ము లేపింది, దాంతో ఇప్పుడు సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవడం ఖాయమని అంటున్నారు.

పూర్తీ ఆఫ్ లైన్ లెక్కలు తేలాల్సి ఉండగా అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా 4.5 కోట్ల నుండి 5 కోట్ల లోపు షేర్ ని కూడా అందుకోవచ్చని టాక్. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ ని బట్టి చూస్తె మొత్తం మీద..

5.5 కోట్ల నుండి 6 కోట్ల మధ్యలో షేర్ ని వసూల్ చేయవచ్చని అంటున్నారు. 4 సినిమా ల పోటి లో ఇది సూపర్బ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇవన్నీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటేనే సాధ్యం, లేకపోతె కొద్దిగా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here