టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా పై ఉన్న అంచనాల దృశ్యా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో భారీగా రిలీజ్ అయిన సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ ఓవరాల్ గా సినిమా…
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకునే రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేక పోయింది. మొదటి రోజు నైజాం ఏరియా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 9 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా ఫస్ట్ డే షోలు ఆర్ ఆర్ ఆర్ తర్వాత రికార్డ్ లెవల్ లో ఉండటంతో ఫుల్స్ అయితే చాలా తక్కువ చోట్ల లోనే పడ్డాయి….
థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉండటంతో అవన్నీ కలెక్షన్స్ లో యాడ్ కాబోతుండగా కౌంటర్ సేల్స్ అన్ని చోట్లా అనుకున్నట్లు ఉంటే తొలిరోజు నైజాంలో సినిమా ఎస్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది, ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో మట్టుకు సినిమా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే తొలిరోజు పెర్ఫార్మ్ చేసింది…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా 26-28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా కొన్ని చోట్ల హైర్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి అవన్నీ కలుపుకుని సినిమా 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక కర్ణాటక లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని అందుకోనున్న ఈ సినిమా తమిళనాడు లో మంచి ఓపెనింగ్స్ ని అందుకోవడం విశేషం….
ఓవర్సీస్ లో ఆల్ రెడీ సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 36-38 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, ఇది నాన్ పాన్ ఇండియన్ మూవీస్ పరంగా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ అనుకున్న రేంజ్ లో సినిమా ఓపెనింగ్స్ లేక పోయినా మొత్తం మీద టాక్ దృశ్యా సాలిడ్ స్టార్ట్ అనే చెప్పాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్ లో ఉంటుందా లేక లెక్క మించుతుందో చూడాలి ఇక….