మెగాస్టార్ చిరంజీవి సెన్సేషన్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా మొదలు అయినా మల్టీ ప్లేక్సులలో బుకింగ్స్ ముందు రోజు వరకు ఓపెన్ కాక పోయినా ఇవేవి బాక్స్ ఆఫీస్ దగ్గర…
మెగా సునామీ ని ఆపలేక పోయాయి, రెండు తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సైరా నరసింహా రెడ్డి మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 80% టు 85% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి…
ఆ ఆక్యుపెన్సీ ముందు అనుకున్నట్లే 90% టు 95% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయ్యింది, దాంతో తొలిరోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 30 కోట్ల నుండి ఇప్పుడు 32 కోట్ల ను క్రాస్ చేసి 34 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక హిందీ లో పెద్దగా గ్రోత్ ని అందుకోలేదు సినిమా…
దాంతో ముందు అనుకున్నట్లే 5 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ 2.6 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు. ఇక కర్ణాటక లో మొదటి రోజు 5 కోట్ల నుండి 6 కోట్ల దాకా షేర్ ని సినిమా రాబట్టవచ్చు. ఇక తమిళ్, మలయాళం రెస్ట్ ఆఫ్ ఇండియా లో గ్రోత్ పెద్దగా కనిపించలేదు కానీ టోటల్ గా…
2 నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఓవర్సీస్ లో 10 కోట్ల రేంజ్ లో షేర్ ని టోటల్ గా అందుకునే అవకాశం ఉంది. దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ షేర్ 50 కోట్ల నుండి 55 కోట్లు మినిమం ఉండే అవకాశం ఉంది, అలాగే గ్రాస్ 90 కోట్ల నుండి 100 కోట్ల వరకు వెళ్ళే చాన్స్ కూడా ఉంది. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.