యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని అందుకుని లాంగ్ రన్ లో ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి విజయాలుగా నిలిచాయి. కానీ ఆ ఇంపాక్ట్ ఏమి కూడా నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థాంక్యూ సినిమా మీద పడలేదు… సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ కూడా పెద్దగా ఏర్పడలేదు. దానికి తోడూ రిలీజ్ రోజు…
హెవీ వర్షాల ఇంపాక్ట్ కూడా పడగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వరకు కూడా ఏవి కూడా అనుకున్న రేంజ్ లో లేవు. దాంతో రీసెంట్ టైం లో నాగ చైతన్య కెరీర్ లోనే లోవేస్ట్ ఓపెనింగ్స్ ఇప్పుడు సినిమా సొంతం చేసుకోబోతుంది.
మొత్తం మీద సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కలెక్షన్స్ రిలీజ్ కి ముందు రోజు 1.1 కోట్ల రేంజ్ లో ఉండగా రీసెంట్ టైం లో మీడియం రేంజ్ మూవీస్ లో లేవేస్ట్ కాగా సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 15% రేంజ్ లో ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకోగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది సినిమా… సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద కొన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ రిపోర్ట్స్ ని బట్టి చూస్తుంటే 2.5 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
ఓవరాల్ కలెక్షన్స్ 3 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఇది కూడా ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా బాగుంటేనే సాధ్యం… మొత్తం మీద సినిమా మొదటి రోజు భారీ నిరాశకలిగించే కలెక్షన్స్ ని సాధించబోతుంది. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఏమైనా గ్రోత్ ఏమైనా చూపిస్తుందో చూడాలి…