బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని హీరోగా ఆది పినిశెట్టి విలన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం అనుకున్న విధంగా జరగక పోయినా కానీ తొలిరోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి సినిమా చాలా సెంటర్స్ లో 70-80% రేంజ్ లో ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకోగా ఆంధ్రలో చాలా ఏరియాల్లో…
హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక నైజాంలో హెవీ టికెట్ రేట్స్ వలన సింగిల్ స్క్రీన్స్ లో పర్వాలేదు అనిపించినా మల్టిప్లెక్సులలో తక్కువ ఆక్యుపెన్సీనే సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా కి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అడ్డంకిగా మారగా ఆంధ్రలో సినిమా స్టడీగానే ఉండగా నైజాంలో కొంచం గ్రోత్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద రిలీజ్ రోజు ముందు బుకింగ్స్ చూసి సినిమా 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందనుకున్నా సినిమా రిలీజ్ రోజున రామ్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో ఇప్పుడు డీసెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకోబోతుంది.
సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ కి మించి ఆఫ్ లైన్ లోనే ఎక్కువ బుకింగ్స్ జరుగుతూ ఉండటంతో వర్షాల ఇంపాక్ట్ ఏమి లేకుండా అన్ని చోట్లా నైట్ షోలు ఎక్స్ లెంట్ గా కొనసాగితే సినిమా 5 కోట్ల నుండి 5.5 కోట్ల దాకా ఓపెనింగ్స్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది.
మొత్తం మీద ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో ది వారియర్ ఓపెనింగ్స్ లేవు కానీ కొద్ది వరకు రామ్ రెడ్ మూవీ రేంజ్ లో ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా రిలీజ్ కి ముందు రోజు అంచనాలతో పోల్చితే తొలిరోజు ది వారియర్ సాలిడ్ గానే ఓపెన్ అవుతుంది అని చెప్పాలి. ఇక అఫీషియల్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.