బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ తొలిరోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల నుండి 5.5 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దానికి తోడూ సినిమా కి హైర్స్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా….
మొదటి రోజు ఓవరాల్ కలెక్షన్స్ అనుకున్న దాని కన్నా మించి పోయి 7 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని రామ్ మాస్ పవర్ ని చూపించింది అని చెప్పాలి.
సినిమా తమిళనాడు లో ఓవర్సీస్ లో లేట్ గా రిలీజ్ అవ్వడంతో అక్కడ కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేదు. అయినా కానీ సినిమా కి వర్షాలు, టాక్ లాంటివి ఇబ్బంది పెట్టిన మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పంబ లేపింది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే టోటల్ గా…
సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.95Cr
👉Ceeded: 1.06Cr
👉UA: 1.02Cr(41L hires)
👉East: 51L(11L hires)a
👉West: 67L(35L hires)
👉Guntur: 1.19Cr(68L~ hires)
👉Krishna: 33L
👉Nellore: 29L(5L~ hires)
AP-TG Total:- 7.02CR(10.20Cr~ Gross)(1.60Cr~ Hires)
👉KA+ ROI: 40L
👉OS: 30L
👉Tamil – 30L~ est
Total World Wide: 8.02CR(12.20CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38.10 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 30.98 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.