మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు రిలీజ్ అయ్యాయి, సినిమా ముందు గా ఒక్కో ఏరియా లో సంచలన కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల లో నాన్ బాహుబలి రికార్డు తో ఏకంగా 38.75 కోట్ల షేర్ ని అందు కుని సంచలనం సృష్టించింది.
ఇక మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ కొంత షాకింగ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. హిందీ లో 4 నుండి 5 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే సినిమా 2.6 కోట్ల నెట్ కలెక్షన్స్ తోనే సరి పెట్టుకుంది, కన్నడ లో 7 కోట్లు మార్క్ ని అందుకునే చాన్స్ ఉంది అనుకుంటే…
ఫైనల్ గా 6.4 కోట్ల షేర్ ని అందుకుంది, ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ దాటుతుంది అనుకుంటే ప్రీమియర్స్ మరియు ఫస్ట్ కలెక్షన్స్ తో ఆ మార్క్ ని అందుకుంది, తమిళ్ కేరళలో పెద్దగా ప్రభావం చూపలేక పోయింది సినిమా. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
?Nizam: 8.1C(2C hires)
?Ceded: 5.91C(2.23C H)
?UA:4.72C
?East: 5.34C(3C H)
?West: 4.5Cr(2C H)
?Guntur: 5.06C(2.89C H)
?Krishna:3.03C
?Nellore: 2.09C(1.31C H)
60L Hires in several places
AP-TG: 38.75C(14.03Cr H)
Karnataka – 6.40Cr
Tamil – 0.60Cr
Kerala – 0.32Cr
Hindi& ROI- 1.4Cr
USA/Can- 4.25Cr
ROW- 2Cr
1st Day Total – 53.72Cr(85cr Gross)
సినిమా ను టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 187.25 కోట్లకు అమ్మగా అంటే టోటల్ గా 188 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కాగా సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 134.28 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే సినిమా క్లీన్ హిట్ అవుతుంది.