Home న్యూస్ వెంకిమామ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…ఇదేమి రచ్చ సామి అసలు!!

వెంకిమామ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…ఇదేమి రచ్చ సామి అసలు!!

1205
0

     ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వెంకిమామ హవా కొనసాగింది, ఏ రేంజ్ లో అంటే అనుకున్న టార్గెట్ ని అందుకుని మొదటి రోజు సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో సినిమా జోరు చూస్తుంటే కచ్చితంగా లాంగ్ రన్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని పిస్తుంది.

ఇక మొదటి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 7 కోట్ల రేంజ్ మార్క్ ని అందుకుంటుంది అనుకోగా అనుకున్నట్లే తొలి రోజు 7.05 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు అనుకున్నా…

వరల్డ్ వైడ్ గా అంచనాలను మించిన సినిమా మొదటి రోజు 8.93 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సత్తా చాటుకుని సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా గ్రాస్ 16.5 కోట్ల మార్క్ ని అందుకుందని యూనిట్ వర్గాలు అనౌన్స్ చేశాయి.

ఇక మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 2.29CR
👉Ceeded: 1.60CR
👉UA: 87L
👉East: 60L
👉West: 34L
👉Guntur: 72L
👉Krishna: 36L
👉Nellore: 27L
AP-TG Total:- 7.05CR💥💥
Ka & ROI: 86L
OS: 1.02Cr
Total: 8.93CR(16.5Cr Gross)
ఇదీ మొత్తం మీద మొదటి రోజు వెంకిమామ కలెక్షన్స్ జోరు.

సినిమా ను 33.10 కోట్లకు అమ్మగా 34 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే తొలి రోజు కలెక్షన్స్ ని పక్కకు పెట్టి మరో 25.07 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, అంటే రెండో రోజు సినిమా సాలిడ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రెండో రోజు సినిమా స్టేటస్ మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here