పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ యునానిమస్ రిపోర్ట్స్ తో రిలీజ్ అయింది. సినిమా మొదటి రోజు అల్టిమేట్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించడం ఖాయం అనుకున్న ఆంధ్రలో టికెట్ హైక్స్ తగ్గిస్తున్నట్లు, బెనిఫిట్ షోలు ఆపడం లాంటివి చేశారు. చాలా సెంటర్స్ లో ఇవి జరిగాయి కూడా.. కానీ ఈవినింగ్ టైం లో హై కోర్టు టికెట్ హైక్స్ కి ఒప్పుకుంది.
దాంతో మొదటి రోజు కలెక్షన్స్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ రికార్డులను నమోదు చేసేలా చేసింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 26-28 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు అని భావించగా హైర్స్ కూడా కలవడం, నైట్ షోలకు సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని…
అలానే కొనసాగించడం తో లెక్క 30 కోట్ల మార్క్ ని కూడా దాటేసి మొత్తం మీద ఇప్పుడు 32 కోట్లకు పైగా షేర్ ని మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది వకీల్ సాబ్ సినిమా. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది.
సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 8.75Cr
👉Ceeded: 4.50Cr
👉UA: 3.85Cr(GST- 37L)
👉East: 3.10Cr( Hires – 90L)
👉West: 4.50Cr(Hires, MG-3.41Cr)
👉Guntur: 3.94Cr(Hires – 1.8Cr)
👉Krishna: 1.90Cr(hires+GST -34L)
👉Nellore: 1.70Cr(hires – 41L)
AP-TG Total:- 32.24CR (44Cr~ Gross)(6Cr Hires)
KA+ROI – 1.82Cr (Approx)
OS- 2.40Cr (Approx)
Total WW: 36.46CR(52.4Cr~ Gross)
సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 89.35 కోట్లకు అమ్మగా సినిమా 90 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది, మొదటి రోజు కలెక్షన్స్ తర్వాత సినిమా మరో 53.54 కోట్ల షేర్ ని సాధిస్తే క్లీన్ హిట్ అవుతుంది, బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ అనుకున్నట్లు ఉండి కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో పరిస్థితులు బాగుంటే సినిమా భీభత్సం మరో లెవల్ లో ఉండి ఉండేది..