ఎం.ఎం. కీరవాణి తనయులు ఒకరు హీరోగా మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన కొత్త సినిమా మత్తు వదలరా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా కొత్తదనం కోరుకునే వారుకి డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారికి బాగానే నచ్చుతుంది, దానికి తోడూ తొలిరోజు రిలీజ్ అవ్వడం క్రిస్టమస్ హాలిడే రోజు అవ్వడం తో ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం మీద 34 లక్షల దాకా షేర్ ని అందుకుంది. చాలా లిమిటెడ్ రిలీజ్ లో అది కూడా పోటి లో ఇది పర్వాలేదు అనిపించే కలెక్షన్స్.
ఇక సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లెక్కలను నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు, దాంతో ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓవరాల్ గా సినిమా బిజినెస్ 1.5 కోట్ల రేంజ్ లో అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.
ఆ లెక్క ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అవ్వాలి అంటే 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమమ్ వసూల్ చేయాల్సి ఉంటుంది, ఇక మొదటి రోజు 34 లక్షల షేర్ రావడం తో మిగిలిన రన్ లో సినిమా మరో 1.46 కోట్ల షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కన్నా 20% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మినిమమ్ గ్రోత్ ఉన్నా మొత్తం మీద రెండో రోజు 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. మరి అంతకుమించి ముందుకు వెళుతుందో లేదో చూడాలి.