పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకోగా U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న సినిమా 2 గంటల 25 నిమిషాల లెంత్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటి అనేది…
బయటికి వచ్చేసింది. ఆ టాక్ ని గమనిస్తే…. సినిమా ఓ సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ కి అలాగే ఓ చిన్న కేసులో భాగంగా పోలిస్ స్టేషన్ కి వచ్చిన రానా దగ్గుబాటి ల మధ్య వచ్చిన ఈగో క్లాష్ వలన ఏర్పడిన గొడవ ఎంత దూరం వెళ్ళింది, వీళ్ళ ఈగోల వలన…
తర్వాత ఏర్పడిన సమస్యలు ఏంటి అనే కాన్సెప్ట్ తో వచ్చిన భీమ్లా నాయక్ ఆల్ మోస్ట్ మెయిన్ స్టొరీ పాయింట్ ఒరిజినల్ లో ఉన్నట్లే ఉండటం జరిగిందని, మెయిన్ స్టొరీ పాయింట్ ఒకటే అయినా ఇక్కడ ట్రీట్ మెంట్ కొంచం డిఫెరెంట్ గా ఉంటుందని సమాచారం…
ఒరిజినల్ వర్షన్ లెంత్ ఎక్కువ ఉండగా ఇక్కడ లెంత్ ని చాలా వరకు తగ్గించారని సమాచారం, ఫస్టాఫ్ వరకు కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టినా కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి అసలు కథ ఈగో క్లాష్ లు మొదలు అవుతాయని, ఇంటర్వెల్ నుండి రచ్చ స్టార్ట్ అవుతుందని సమాచారం. సెకెండ్ ఆఫ్ కథ ఆసక్తిగా సాగుతుందని సమాచారం. ఓవరాల్ గా సినిమా….
ఒరిజినల్ రేంజ్ లోనే మెప్పించిందని, ఇక్కడ మినిమమ్ గ్యారెంటీ కన్ఫాం అన్నట్లు చెబుతున్నారు, ఫైనల్ టాక్ ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇదే కనుక నిజం అయ్యి రిలీజ్ రోజున ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా రచ్చ రచ్చ ఖాయమని చెప్పొచ్చు…. మరి భీమ్లా నాయక్ ఒరిజినల్ రేంజ్ లో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి ఇక…