ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్, సుధీర్ బాబు హీరోగా నటించిన్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడగా సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా సాలిడ్ గానే వచ్చింది… చాలా కాలంగా ఒక మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఈ సినిమా తో ఆ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని నమ్మకంగా ఉన్నారు.
ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ ని సొంతం చేసుకోగా సినిమా రన్ టైం 2 గంటల 34 నిమిషాల లెంత్ తో తెరకెక్కింది… ఇక సినిమా కి సెన్సార్ నుండి వినిపిస్తున్న ఫస్ట్ టాక్ కూడా బయటికి రాగా ఆ టాక్ ప్రకారం సినిమా…
ఆడియన్స్ ను అలరించే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు….లైటింగ్ పని చేసుకునే హీరో సోడా సెంటర్ హీరోయిన్ లు ప్రేమించుకోవడం పెద్దలు కాస్ట్ వేరని నో చెప్పడం, ఇంతలో హీరో లైఫ్ లో విలన్ ఎంట్రీ ఇవ్వడం తో హీరో విలన్ ల గొడవ వలన అనుకోని పరిస్థితులు రావడం….
తర్వాత హీరో జైలుకి వెళ్ళడం జరుగుతుందని ట్రైలర్ లోనే సినిమా కథ మొత్తాన్ని రివీల్ చేశారు. కానీ జైలుకి వెళ్ళడానికి అసలు కారణం అండ్ హీరో హీరోయిన్స్ ఇద్దరూ కలిసారా లేదా అన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మొత్తం మీద ఫస్టాఫ్ వరకు సరదా సరదాగా సాగినా ఇంటర్వెల్ నుండి కొంచం సీరియస్ అయ్యి సెకెండ్ ఆఫ్ మొత్తం ఇంటెన్స్ సీన్స్ తో…
సినిమా సాగుతుందని, అక్కడక్కడా కొన్ని సీన్స్ లెంత్ ఎక్కువ అయినట్లు అనిపించినా ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ మనసు గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సుధీర్ బాబు రీసెంట్ మూవీస్ లో బెస్ట్ అనిపించే కమర్షియల్ హంగులతో సినిమా మెప్పిస్తుందని అంటున్నారు. మరి సినిమా ఇదే రేంజ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాక టాక్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.