Home న్యూస్ మరో మైలురాయి…13 ఏళ్ల కెరీర్ లో తొలిసారి!!

మరో మైలురాయి…13 ఏళ్ల కెరీర్ లో తొలిసారి!!

1174
0

  ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృశ్యా మొదటి రోజే భారీ వసూళ్లు రావడం మనం చూస్తూనే ఉన్నామ్, కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు టాక్ బాగుంటే కానీ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రావు, కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రివ్యూ లతో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో రామ్ కెరీర్ బెస్ట్ రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతుంది, ఈ క్రమం లో 4 రోజుల లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది.

ఇక ఇప్పుడు 5 వ రోజు కలెక్షన్స్ తో సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో ప్రతిష్టాత్మక మినిమం బెంచ్ మార్క్ అయిన 25 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది. ప్రస్తుతం అందరు మీడియం రేంజ్ హీరోలు మంచి మూవీ పడితే 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటున్నారు. కానీ కెరీర్ మొదలు పెట్టి 13 ఏళ్ళు అవుతున్నా నికార్సయిన మాస్ హిట్ లేని రామ్ ఇప్పుడు ఆ లోటు ని…

ఇస్మార్ట్ శంకర్ తో తీర్చు కోగా సినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ రామ్ కెరీర్ లో మొదటి 25 కోట్ల షేర్ మూవీ గా అవతరించింది. 13 ఏళ్ల కెరీర్ లో తొలిసారి 25 కోట్ల షేర్ మూవీ ని తన ఖాతాలో వేసుకున్న రామ్ ఇప్పుడు లాంగ్ రన్ లో ఈ సినిమాతో 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ వసూళ్ళ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here