నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన హాట్రిక్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు ప్రతిష్టాత్మక 100 కోట్ల గ్రాస్ మార్క్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ట్రేడ్ లెక్కల్లో సినిమా 10 రోజుల టైం కి వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ని అందుకోగా మేకర్స్ కూడా సరిగ్గా ఇదే విధంగా….
సినిమా 10 రోజుల కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన చాలా మంది సినిమా మేకర్స్ ని యూనిట్ ని మెచ్చుకుంటున్నారు అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ అన్నవి చాలా కామన్….
అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే… సినిమా కి అన్ని ట్రేడ్ వర్గాలు రోజు వారి చెప్పే కలెక్షన్స్ ఒకలా ఉంటే మేకర్స్ రిలీజ్ చేసే గ్రాస్ పోస్టర్స్ లెక్క వేరుగా ఉండటం అవి నిజం అనుకుని ఫ్యాన్స్ నమ్మి ఇతర హీరోలని ఫ్యాన్స్ ని ట్రోల్ చేయడం సర్వ సాదారణంగా టాలీవుడ్ అనే కాదు ఇతర ఇండస్ట్రీలలో కూడా….
జరుగుతూ వస్తుంది అని చెప్పాలి… ఇలాంటి టైం లో అఖండ మేకర్స్ మాత్రం సినిమా సరిగా 10 రోజుల్లో 100 కోట్ల మార్క్ ని అందుకుందని చెప్పగా ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో కూడా సినిమా అదే రేంజ్ వసూళ్ళ మార్క్ ని అందుకుంది ఇప్పుడు. నైజాం లో ఆల్ మోస్ట్ 30 కోట్లకు చేరువ అయిన గ్రాస్ సీడెడ్ లో 18 కోట్లకు పైగా…
టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 81 కోట్లకు పైగా ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు. టోటల్ ఓవర్సీస్ లో 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని 100 కోట్ల గ్రాస్ ని 10 రోజుల్లో అందుకుని సంచలనం సృష్టించగా కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఫేక్ లేకుండా నిజాయితీగా పోస్టర్ ని కరెక్ట్ టైం లో రిలీజ్ చేసి మేకర్స్ శెభాష్ అనిపించుకున్నారు. ఇతర మూవీ యూనిట్స్ కూడా ఇదే ఫాలో అయితే బాగుంటుంది.