బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు, సినిమా వీకెండ్ లో కుమ్మేసినా కానీ వర్కింగ్ డేస్ లో భారీగానే స్లో డౌన్ అయింది, దానికి తోడూ ఇప్పుడు 7 వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగి పోయే రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని దెబ్బ కొట్టింది…
సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ రావొచ్చని ఆన్ లైన్ బుకింగ్స్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ తో అంచనా వేసినా కంప్లీట్ గా అంచనాలు తప్పిన సినిమా ఊహకందని రేంజ్ లో డ్రాప్ అయ్యి…
కేవలం 98 లక్షల రేంజ్ షేర్ నే సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర, థియేటర్స్ ఎక్కువ ఉండటం, టికెట్ హైక్స్ ఎక్కువ ఉండటం వలన నైజాంలో రెంట్స్ కట్టగా షేర్ చాలా తక్కువగా రాగా పలు చోట్ల సినిమాకి డెఫిసిట్ లు కూడా పడటం జరిగింది 7 వ రోజున…
అయినా కానీ ఈ రేంజ్ లో డౌన్ అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు…. మొత్తం మీద ఇప్పుడు మొదటి వారంలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 33.22Cr(Without GST- 30.40Cr)
👉Ceeded: 10.09Cr(50L hires)
👉UA: 6.91Cr
👉East: 5.02Cr
👉West: 4.63Cr
👉Guntur: 4.82Cr
👉Krishna: 3.38Cr(10L rents added)
👉Nellore: 2.33Cr
AP-TG Total:- 70.40CR(106.90Cr~ Gross)
KA+ROI: 7.65Cr
OS: 11.55Cr
Total World Wide: 89.60CR(146CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి వారంలో సాధించిన టోటల్ కలెక్షన్స్, 7 వ రోజు దెబ్బ ఒక్కటి ఊహించని విధంగా ఎఫెక్ట్ కొట్టినా కానీ ఓవరాల్ గా మొదటి వారం మంచి వసూళ్ళని సినిమా సాధించింది. 108 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా కి ఇంకా 18.40 కోట్ల దాకా షేర్ అవసరం ఉంది, ఇక రెండో వారంలో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.