అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 9 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ నాంది, రీసెంట్ గా భారీ పోటి లో రిలీజ్ అయిన ఈ సినిమా కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్లో స్టార్ట్ ని సొంతం చేసుకున్నా కానీ మౌత్ టాక్ తో కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని….
అల్లరి నరేష్ కెరీర్ లో 9 ఏళ్ల తర్వాత క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచింది, వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ ను బాగానే మొదలు పెట్టిన సినిమా తర్వాత కొంచం స్లో డౌన్ అయినా మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ గానే పెర్ఫార్మ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
ప్రాఫిట్స్ లో ఎంటర్ అయింది, సినిమా మొత్తం మీద మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.27 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 3.47 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని వీక్ ని ఘనంగా ముగించుకుంది. మొత్తం మీద సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.35Cr
👉Ceeded: 44L
👉UA: 32L
👉East: 26L
👉West: 19L
👉Guntur: 27L
👉Krishna: 28L
👉Nellore: 16L
AP-TG Total:- 3.27CR (6.16Cr Gross~)
KA+ROI – 8L
OS – 12L
Total WW: 3.47CR(6.40Cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా మొదటి వారాన్ని ఘనంగా ముగించగా…
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కాగా సినిమా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 47 లక్షల ప్రాఫిట్ ను ప్రస్తుతానికి సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, రెండో వారం సినిమా హోల్డ్ చేసి గ్రోత్ చూపిస్తే సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఎం జరుగుతుందో చూడాలి..