రాజ్ తరుణ్ మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా…. ఆహా వీడియో లో ఈ నెల 1 న సాయంత్రం 6 కి ఈ సినిమా రిలీజ్ అయ్యింది, టాక్ మరీ ఆశించిన మేర లేకున్నా కానీ సినిమా యూనిట్ మొత్తం సినిమా ను బాగా ప్రమోట్ చేయడం తో సినిమా కి ఆహా వీడియో లో మంచి వ్యూస్ దక్కుతున్నాయి.
కాగా సినిమా మొదటి వీకెండ్ కి గాను ఆహా వీడియో లో 3 లక్షలకు పైగా యూనిక్ వ్యూస్ నీ సొంతం చేసుకోగా… ఆహా వీడియో మినిమమ్ 3 నెలల పెయిమేంట్ 150 ఉండటం తో ఒక నెలకి కౌంట్ చేసుకునా 50 కి ఒక యూనిక్ అనుకున్నా సినిమా కి…
1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినట్లు లెక్క. ఇక సినిమా మొదటి వారం లెక్కలు కూడా రిలీజ్ అయ్యాయి. మొదటి వారానికి గాను సినిమా ఆహా వీడియో లో 5 లక్షల 50 వేల రేంజ్ లో యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం. వర్కింగ్ డేస్ లో కూడా సినిమా కి మంచి వ్యూస్ దక్కాయి…
దాంతో మొత్తం మీద 50 రేటు తో 5 లక్షల 50 వేల యూనిక్ వ్యూస్ లెక్కలను పరిగణ లోకి తీసుకుంటే… 2.75 కోట్ల దాకా రెవెన్యూ వచ్చి ఉండొచ్చని అంచనా వేయవచ్చు. ఓవర్సీస్ లో రేటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లెక్కకి కొంచం అటూ ఇటూ గా కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేసుకోవచ్చు. మొత్తం మీద ఒరేయ్ బుజ్జిగా సినిమా ని…
4 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్న ఆహా వీడియో కి మొదటి వారం లో 2.75 కోట్ల రేంజ్ రెవెన్యూ దక్కితే సినిమా మరో 1.25 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటే పెట్టిన రేటు రిటర్న్ వచ్చేసినట్లే లెక్క… రెండో వీకెండ్ లెక్కలు తేలితే సినిమా ఎంత వరకు వ్యూస్ ని సొంతం చేసుకుందో తెలుస్తుంది…