మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని హిస్టారికల్ లెవల్ లో పూర్తీ చేసుకుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ దసరా సెలవుల అడ్వాంటేజ్ ని ఫుల్లు గా వాడుకుని ఏకంగా ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ మొదటి వారం కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 7.9 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసిన సినిమా మిగిలిన చోట్లలో కర్ణాటక అండ్ ఓవర్సీస్ లో మంచి వసూళ్ళ ని సాధించింది. మొత్తం మీద మొదటి వారం వరల్డ్ వైడ్ గా సైరా నరసింహా రెడ్డి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
?Nizam: 23.92C
?Ceded: 15.04C
?UA: 12.38C
?East: 8.28C
?West: 6.31Cr
?Guntur: 8.48C
?Krishna: 6.41C
?Nellore: 3.67C
AP-TG: 84.49C
Karnataka – 12.10Cr(*Corrected)
Tamil – 1.26Cr
Kerala – 0.70Cr
Hindi& ROI- 4.98Cr
USA/Can- 8.25Cr
ROW- 3.60Cr
7 days Total – 115.38Cr(188.5cr Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 188 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 72.62 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, 270 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో…
నిర్మాతలు సేఫ్ గానే ఉన్నా కొన్న వాళ్ళు సేఫ్ అవ్వాలి అంటే సినిమా భారీ వసూళ్ళని రెండో వారం లో సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిగిలిన చోట్ల డౌన్ అయినా తెలుగు రాష్ట్రాలలో మరో 2 వారాలు సినిమా జోరు చూపితేనే బ్రేక్ ఈవెన్ కి ఓవరాల్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది.