యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలను అందుకునే రేంజ్ టాక్ ని సొంతం చేసుకోకున్నా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ ని పర్వాలేదు అనిపించే…
కలెక్షన్స్ తో ముగించింది ఇప్పుడు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ కొండంత ఉండటంతో సినిమా ఇంకా జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా 3 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల నుండి 10.50 కోట్లకు వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేయగా…
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10.58 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది… ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాగానే పెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది అని చెప్పాలి. ఇక హిందీ లో కూడా బాగానే హోల్డ్ చేసినా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దది… ఇక మొత్తం మీద సినిమా ఇప్పుడు…
మొదటి వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 22.31Cr(inc GST)
👉Ceeded: 6.65Cr
👉UA: 4.26Cr
👉East: 3.87Cr
👉West: 2.98Cr
👉Guntur: 4.08Cr
👉Krishna: 2.34Cr
👉Nellore: 1.90Cr
AP-TG Total:- 48.39CR(75.20CR~ Gross)
👉Karnataka: 3.95Cr
👉Tamilnadu: 0.61Cr
👉Kerala: 0.13Cr
👉Hindi: 6.80Cr
👉ROI: 1.40Cr
👉OS – 10.55Cr
Total WW: 71.83CR(126.50CR~ Gross)
మొత్తం మీద సినిమాను 202.80 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా మొదటి వీకెండ్ తర్వాత ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఇంకా 132.17 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.