Adi Purush Bookings REPORT: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్(Adi Purush) ఇప్పుడు భారీ లెవల్ లో రిలీజ్ కానుండగా అన్ని చోట్లా సినిమా బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ అయింది, తెలుగు రాష్ట్రాలలో మాత్రం బుకింగ్స్ కొంచం…
లేట్ గా ఓపెన్ అవ్వగా మిగిలిన చోట్ల బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ అయ్యాయి. హిందీ లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న సినిమా ప్రభాస్ సాహో మూవీతో పోల్చితే బెటర్ బుకింగ్స్ చాలా సెంటర్స్ లో కనిపిస్తూ ఉండటం విశేషం.
దాంతో హిందీలో సినిమా 25-28 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ యమ జోరుగా సాగుతూ ఉండటంతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తుంది. నైజాంలో బుకింగ్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి.
ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 240 కోట్ల బిజినెస్ తో 7000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ప్రజెంట్ బుకింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగానే గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీ లో 30 నుండి 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు.
ఇక కర్ణాటకలో 8-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం మీద 5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే 110 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించవచ్చు. ఇక రిలీజ్ రోజున బుకింగ్స్ అండ్ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు.