Home న్యూస్ 1st డే అందాల రాక్షసి4K కలెక్షన్స్….చిన్న సినిమా భీభత్సం!!

1st డే అందాల రాక్షసి4K కలెక్షన్స్….చిన్న సినిమా భీభత్సం!!

0

2012 టైంలో రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకునే విషయంలో విఫలం అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గ అనిలిచిన అందాల రాక్షసి(Andala Rakshasi4K) సినిమా తర్వాత టైంలో సాంగ్స్ వలన మంచి పాపులారిటీని సొంతం చేసుకోగా ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు డీసెంట్ లెవల్ లో రీ రిలీజ్ అవ్వగా…

ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా సాలిడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. మొదటి రోజు కన్నా ముందు అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్ మోస్ట్ 20 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ రోజున…

చాలా చోట్ల ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుని కొత్త సినిమాల కన్నా బెటర్ గా ట్రెండ్ అవ్వగా ఆల్ మోస్ట్ 18 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక కలెక్షన్స్ పరంగా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో 95 లక్షలకు పైగా వసూళ్ళని అందుకోగా…

రెస్ట్ ఆఫ్ ఇండియా తో కలిపి ఓవరాల్ గా 1.05 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. కొన్ని మంచి సినిమాలు రీ రిలీజ్ లో కూడా సాధించని వసూళ్ళని మొదటి సారి రిలీజ్ అయినప్పుడు డిసాస్టర్ అయినా కూడా రీ రిలీజ్ లో..

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఈ సినిమా మాస్ రచ్చ చేయడం విశేషం. అందులో కూడా నైజాంలోనే ఆల్ మోస్ట్ 55 లక్షలకు పైగా వసూళ్లు రాగా సీడెడ్ లో 7 లక్షలకు పైగా వసూళ్లు వచ్చాయి. ఆంధ్రలో మిగిలిన కలెక్షన్స్ రాగా మొత్తం మీద ఎక్స్ లెంట్ వసూళ్ళని…

సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ లో మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అని అందరూ అనుకున్నా కూడా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించి పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here