బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) రీసెంట్ గా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ నుండి మంచి టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. అల్లు అర్జున్ కెరీర్ లో…
ఈ సినిమా బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించడం విశేషం…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇక్కడ కొత్త రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్నా కూడా కొత్త రికార్డుల విషయంలో కొంచం వెనుకంజ వేసి ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది..
కానీ అల్లు అర్జున్ ప్రీవియస్ మూవీస్ మీద పుష్ప2 మూవీ ఊహకందని రేంజ్ లో గ్రోత్ ని చూపించింది…టాలీవుడ్ చరిత్రలో మొదటి రోజున 70 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న రెండో సినిమాగా పుష్ప2 మూవీ మాస్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది…. సినిమా మొదటి రోజు 70.81 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
ఒకసారి సినిమా తెలుగు రాష్ట్రలలో సాధించిన మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 1st Day Telugu States Collections(Inc Premieres, GST)
👉Nizam: 25.60Cr
👉Ceeded: 12.48Cr
👉UA: 7.70Cr
👉East: 4.90Cr
👉West: 4.45Cr
👉Guntur: 7.60Cr
👉Krishna: 5.20Cr
👉Nellore: 2.88Cr
AP-TG Total:- 70.81CR(97.50CR~ Gross)(15.27Cr~ Hires)
మొత్తం మీద సినిమా ప్రీమియర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు అంచనా….ఇక మొదటి రోజు కలెక్షన్స్ తో కలిపి ఊహకందని స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్…
215 కోట్ల దాకా ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 144 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు…