బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో డీసెంట్ అంచనాలతో రూపొందిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల ముందే..
ఓపెన్ చేసినా కూడా పెద్దగా బుకింగ్స్ లో జోరు చూపించ లేక పోయింది సినిమా…దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అవ్వగా హాలిడే రిలీజ్ అవ్వడంతో మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా…
డే మొత్తం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపిస్తే మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఓవరాల్ గా..
మొదటి రోజున 2 కోట్లు ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సినిమా రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ లో బింబిసార తర్వాత ప్లేస్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటకా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా…
అలాగే ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే మొదటి రోజు లెక్క 2.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సినిమా ఎలాంటి గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి. ఇక మొదటి రోజు ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.